వైద్య రంగంలో నోబెల్ బహుమతి దక్కింది వారికే..

2021 Medicine Nobel for discovery of temperature, touch receptors. ఈ ఏడాది వైద్యరంగంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియన్ లకు సంయుక్తంగా

By Medi Samrat  Published on  4 Oct 2021 12:59 PM GMT
వైద్య రంగంలో నోబెల్ బహుమతి దక్కింది వారికే..

ఈ ఏడాది వైద్యరంగంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియన్ లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి ప్రకటించారు. ఉష్ణోగ్రత, స్పర్శలకు సంబంధించిన గ్రాహకాలను ఆవిష్కరించిన వారిద్దరికీ ప్రపంచ అత్యున్నత పురస్కారం లభించింది. వేడి, చల్లదనం, స్పర్శ తాలూకు జ్ఞానం మెదడుకు చేరే క్రమంలో నరాలు ఎలా ప్రేరేపించబడతాయి? వాటి స్పందనలు ఎలా ప్రారంభం అవుతాయి? అనే అంశంలో డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌషియాన్ తమ పరిశోధనల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నారు.

టెంపరేచర్, టచ్ కోసం రెసెప్టార్స్ (ఉష్ణోగ్రత, స్పర్శ గ్రాహకాలు) కనుగొన్నందుకు గాను డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపౌటియన్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రకటించారు. వీరిద్దరూ అమెరికా జాతీయులే..! స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లోని ప్యానెల్ ఈ ప్రకటన చేసింది. మెడిసిన్‌లో గతేడాది ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ అందుకున్నారు. కాలేయాన్ని నాశనం చేసే హెపటైటిస్ సి వైరస్‌ను కనుగొన్నందుకు గాను వారికి ఈ ప్రతిష్టాత్మక బహుమతి లభించింది. ఫిజియాలజీ లేదంటే మెడిసిన్‌లో నోబెల్ బహుమతి అందించడానికి సంబంధించి ఆల్‌ఫ్రెడ్ నోబెల్ కచ్చితమైన విధివిధానాలు రూపొందించారు. వైద్య రంగంలో కనుగొనేది ఏదైనా అది మానవాళికి ఉపయోగపడాలని నోబెల్ చెప్పారు. అవార్డులో భాగంగా పసిడి పతకం, 10 మిలియన్ స్వీడిష్ క్రానర్ (దాదాపు 1.14 మిలియన్ డాలర్లు) అందిస్తారు.


Next Story