పాఠ‌శాల‌పై విమానం కూలిన ఘ‌ట‌న‌.. 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచ‌ర్లు సహా 19 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం భారీ విమాన ప్రమాదం సంభవించింది.

By Medi Samrat
Published on : 21 July 2025 6:36 PM IST

పాఠ‌శాల‌పై విమానం కూలిన ఘ‌ట‌న‌.. 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచ‌ర్లు సహా 19 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం భారీ విమాన ప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకాలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 ట్రైనింగ్ జెట్ BJI ఉత్తరా ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ మరియు కాలేజీ క్యాంపస్‌లోకి దూసుకెళ్లింది.

ఈ విమాన ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా విషాదం నెల‌కొంది. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. అదే సమయంలో పిల్లలు సహా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల్లో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి చెందిన ఒక వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ.. పిల్లలు, పెద్దలు సహా 50 మందికి పైగా కాలిన గాయాల కారణంగా ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. ఉత్తర ఢాకాలోని ఉత్తరాలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం ప్రజలను కలిచివేసింది. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-7 బిజిఐ శిక్షణ విమానం ఉత్తరాలో కూలిపోయింది. విమానం 13:06 (0706 GMT)కి బయలుదేరింది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 ట్రైనింగ్ జెట్ BJI పాఠశాల భవనాన్ని ఢీకొట్టి కూలిపోయింది. విమానం కూలిపోయిన తర్వాత ఆకాశంలో పొగలు కమ్ముకున్నాయని వెల్ల‌డించింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది విమానం దెబ్బతిన్న అవశేషాలపై నీటిని చల్లారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Next Story