ఘోరం.. 240 మందితో వెలుతున్న ప‌డ‌వ‌లో అగ్నిప్ర‌మాదం

14 Killed as Indonesian passenger boat carrying 240 catches fire.ఇండోనేషియాలో సోమ‌వారం ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Oct 2022 4:59 AM GMT
ఘోరం.. 240 మందితో వెలుతున్న ప‌డ‌వ‌లో అగ్నిప్ర‌మాదం

ఇండోనేషియాలో సోమ‌వారం ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఓ ఓడ‌లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించి 14 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ఆ స‌మ‌యంలో ఆ ఓడ‌లో మొత్తం 240 మంది ఉన్నారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. 'KM ఎక్స్‌ప్రెస్ కాంటికా 77' పడవ తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని కుపాంగ్ నుండి కలాబాహి వెలుతుండ‌గా ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో ఓడ‌లో 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది మొత్తం 240 మంది ఉన్నారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అయితే.. అప్ప‌టికే 14 మంది స‌జీవ ద‌హ‌నం అయిన‌ట్లు అధికారులు తెలిపారు. 226 మంది ర‌క్షించిన‌ట్లు చెప్పారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదని, దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

17వేల కంటే ఎక్కువ ద్వీపాల‌తో కూడిన ఇండోనేషియాలో ర‌వాణా కోసం ప‌డ‌వ‌ల‌ను ఉప‌యోగిస్తుంటారు. దీంతో ఇక్క‌డ ప‌డ‌వ ప్ర‌మాదాలు సర్వ‌సాధార‌ణం. కొన్ని సార్లు సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణిస్తుండ‌డంతో ప్ర‌మాదాలు చోటుచేసుకుంటాయి. 1999లో ఇండోనేషియా చ‌రిత్ర‌లోనే అతి పెద్ద విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. 332 మందితో వెలుతున్న ఓడ మునిగిపోయింది. ఈ ప్ర‌మాదంలో 312 మంది మ‌ర‌ణించ‌గా 20 మంది మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఇక 2018లో ఉత్త‌ర సుమత్రా ప్రావిన్స్‌లోని లోతైన అగ్నిపర్వత బిలం సరస్సులో సుమారు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ మునిగి 167 మంది చ‌నిపోయారు.

Next Story