టెన్షన్ పెట్టిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు

జర్మనీ లోని డ్యూసెల్‌డార్ఫ్‌ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు జనాన్ని,

By Medi Samrat  Published on  8 Aug 2023 11:52 AM GMT
టెన్షన్ పెట్టిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు

జర్మనీ లోని డ్యూసెల్‌డార్ఫ్‌ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు జనాన్ని, అధికారులను తెగ టెన్షన్ పెట్టేసింది. ఒక టన్ను బరువుగల ఈ పేలుడు పదార్థాన్ని సిటీ జూ సమీపంలో అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు పేలుడు పదార్థాన్ని గుర్తించిన 500 మీటర్ల పరిధిలోని ప్రజలను అక్కడి నుంచి తరలించేశారు. ఆ ప్రాంతంలోని రోడ్లను మూసివేశారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం నుంచి 13,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి బాంబును డిస్పోజ్‌ చేయించారు.

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు చాలా జర్మనీలో ఉన్నాయి. 2017లో ఫ్రాంక్‌ఫర్ట్‌ లో 1.4 టన్నుల బరువున్న బాంబు బయటపడింది. ఆ ప్రాంతం నుంచి 65,000 మంది ఖాళీ చేయించారు. 2021 డిసెంబర్‌లో కూడా మ్యూనిచ్ స్టేషన్ సమీపంలోని నిర్మాణ స్థలంలో రెండో ప్రపంచ యుద్ధం బాంబు పేలింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. 1940 – 1945 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌, బ్రిటిష్ వైమానిక దళాలు 2.7 మిలియన్ టన్నుల బాంబులను యూరప్‌పై జారవిడిచాయి. అందులో సగం జర్మనీపై పడేశాయి.

Next Story