విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. ప్రయాణికుడు మృతి

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు.

By Medi Samrat  Published on  11 Feb 2025 7:12 AM IST
విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. ప్రయాణికుడు మృతి

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రైవేట్ జెట్ రన్‌వే నుండి వెళ్లిపోయిందని నివేదించింది. ఆ తర్వాత మరో ప్రైవేట్ జెట్‌ను ఢీకొట్టింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. గత 10 రోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. ఈ ఘటన మధ్యాహ్నం 2:45 గంటలకు జరిగినట్లు సమాచారం.

లియర్‌జెట్ 35ఎ విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుండి జారి రాంప్‌పై ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ 200 బిజినెస్ జెట్‌ను ఢీకొట్టింది. దీంతో విమానాశ్రయంలో విమానాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. విమానంలో ఎంత మంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారని స్కాట్స్‌డేల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి డేవ్ ఫోలియో విలేకరుల సమావేశంలో తెలిపారు. విమానంలో ఇంకా ఒకరు చిక్కుకున్నారని తెలిపారు. అమెరికాలో ఇటీవల జరిగిన మూడు విమాన ప్రమాదాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ మూడు ప్రమాదాలపై దర్యాప్తు చేస్తోంది.

Next Story