లోయలో పడిన బస్సు.. 22 మంది మృతి
By అంజి Published on 2 Dec 2019 10:28 AM IST
బస్సు లోయలో పడి 22 మంది మృతి చెందిన సంఘటన టునీషియాలో జరిగింది. వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోవడంతో 22 మంది ప్రయాణికులు మరణించారు. తుని షియా దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వాహనంలో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉండగా 22 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. టునిస్ రాజధాని నగరం నుంచి ఎయిర్ స్నోసి ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Next Story