స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం..
By అంజి Published on 11 March 2020 11:37 AM IST
ముఖ్యాంశాలు
- స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- పరీక్షలు అయ్యాక కొనిస్తామన్న తల్లిదండ్రులు
- కామారెడ్డి జిల్లా దోమకొండలో ఘటన
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దోమకొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. దోమకొండలో కుకుట్ల మౌనిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. చుట్టు పక్కల వారు అందరూ స్మార్ట్‌ఫోన్‌లు వాడడం చూసి.. తాను కూడా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఫోన్ కావాలని తల్లిదండ్రులకు చెప్పింది. ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యాక కొనిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. అయిన వినకపోవడంతో కూతురిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: 6వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్.. బట్టలు చింపి మరీ..
దీంతో విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. విద్యార్థిని పురుగులకు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటా హుటిన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు చికిత్స అందిస్తుండగా విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థిని వయసు 16 సంవత్సరాలు అని తెలిసింది. విద్యార్థిని బలవన్మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారు. అయితే చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు కొనివ్వడం వల్ల చెడు దారులు తొక్కుతున్నారు.
Also Read: అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి