అనుమానాస్పద స్థితిలో టీచర్ మృతి
By రాణి
కృష్ణాజిల్లా కంచికచర్ల లోని జుజ్జూరు రోడ్డు పాములపాటి వారి వీధిలో మహిళా టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయాన్నే వారింట్లో పనిచేసేందుకు వచ్చిన పనిమనిషి టీచర్ నాగమణి మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో..చుట్టుపక్కల వారంతా ఆ ఇంటి ముందు గుమిగూడారు. ఇంతలో ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారమివ్వడంతో..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న నాగమణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాగమణి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.
Also Read : స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం..
కాగా..నాగమణి వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ హై స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. నాగమణికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదని, ఆవిడకు ఎలాంటి సమస్యలు లేవని సన్నిహితులు చెప్పడంతో..పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేకపోతే..వారికేమైనా ఆస్తులున్నాయా ? ఆ ఆస్తుల కోసం అయినవారెవరైనా నాగమణిని హతమార్చి ఉంటారా ? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
Also Read : ప్రియుడితో ఏకాంతంగా..రహస్య వీడియోలు లీక్