ప్రియుడితో ఏకాంతంగా..రహస్య వీడియోలు లీక్

ప్రేమించిన వ్యక్తిని గుడ్డిగా నమ్మడమే ఆ బాలికకు శాపంగా మారింది. ప్రియుడే సర్వస్వం అని నమ్మి తన సర్వస్వాన్ని అర్పించింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మి అతను కోరినప్పుడల్లా శారీరకంగా దగ్గరైంది. జీవితాంతం తోడుంటానని నమ్మబలికిన ప్రియుడే..ఆమె పాలిట కాలయముడయ్యాడు. ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియోలు కాస్తా లీక్ అవ్వడంతో..మనస్తాపం చెందిన ఆ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read : నిజామాబాద్‌లో దారుణం.. మహిళ కాలి వేళ్లను నరికి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన 16 ఏళ్ల బాలిక ఓ యువకుడిని అమితంగా ప్రేమిస్తోంది. అప్పుడప్పుడూ కలుస్తూనే..వీలుకుదిరినప్పుడల్లా వారిద్దరూ ఏకాంతంగా గడిపేవారు. అలాగే గడిపిన క్షణాలను యువకుడు తన వద్దనున్న మొబైల్ లో బంధించాడు. ఈ విషయం ఆ బాలికకు తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. అవసరం తీరిపోయాక ఆ ప్రబుద్ధుడు తనవద్దనున్న వీడియోలను స్నేహితులకు షేర్ చేసి..బాలిక మానం, పరువు, మర్యాదలను నడిరోడ్డుమీద పడేశాడు.

Also Read : క్షణికావేశ నిర్ణయాలతో తలకిందులైన జీవితాలు

ఆ వీడియోల వ్యవహారం కాస్తా బాలిక తల్లిదండ్రుల దృష్టికి రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే తీవ్ర మనోవేదనకు గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రియుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. కాగా..మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సోచట్టం కింద కేసులు నమోదు చేసుకున్నారు. వీడియోలను వైరల్ చేసిన అతడి స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *