నిజామాబాద్‌లో దారుణం.. మహిళ కాలి వేళ్లను నరికి..

By అంజి  Published on  10 March 2020 4:40 AM GMT
నిజామాబాద్‌లో దారుణం.. మహిళ కాలి వేళ్లను నరికి..

నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్యనగర్‌లో ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేసి చంపారు. కాళ్ల వేళ్లను కత్తితో నరికి అతి క్రూరంగా ప్రవర్తించారు. మహిళ హత్యకు గురైన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిసింది. పని మీద బయటకు వెళ్లిన మహిళ భర్త.. అర్థరాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే భార్య ఇంట్లో శవమై కనిపించింది. మృతురాలిపై ఇల్లంతా కారం పచ్చళ్లు పడేసి దుండగులు పరారు అయ్యారు.

వేలి ముద్రలు పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు వరలక్ష్మీని హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో పాటు ఇంట్లో ఉన్న నగదును అపహరించినట్లు సమాచారం. ఈ ఘటనపై మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని నిజామాబాద్‌ నగర ఏసీపీ ప్రభాకర్‌ తెలిపారు.

Also Read: కాళ్లు, చేతులు మంచానికి క‌ట్టేసి.. ప‌చ్చిమిర్చి ముద్ద‌ల‌ను ఒక్కొక్క‌టిగా..

ఈ ఘటనతో ఆర్యనగర్‌లో భయానక వాతావరణం నెలకొంది. నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. మృతురాలు వరలక్ష్మీ, ఆమె భర్త శ్రీనివాస్‌కు ఇవ్వరు పిల్లలు ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌, వరలక్ష్మీ దంపతులు.. బతుకుదెరువు కోసం నిజామాబాద్‌కు వలస వచ్చారు. మృతురాలి పిల్లలిద్దరూ ప్రకాశం జిల్లాలోనే చదువుకుంటున్నారు. శ్రీనివాస్‌ మేస్త్రీ పని చేసుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. భార్య అతి దారుణంగా హత్యకు గురి కావడంతో భర్త శ్రీనివాస్‌ తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. మృతురాలి బంధువులు విషయం తెలుసుకొని నిజమాబాద్‌కు బయల్దేరానని సమాచారం.

Next Story
Share it