50కు పైగా బ్రాండ్లు.. ఫ్లాట్‌ 50% తగ్గింపు.. అన్‌బాక్సింగ్‌ హ్యాపీనెస్‌సేల్ ప్రారంభం

Inorbit Mall Unboxing Happiness Sale. తనివితీరా షాపింగ్‌ చేసేందుకు తగిన సయయం ఆసన్నమైంది.

By Medi Samrat  Published on  1 July 2022 10:45 AM GMT
50కు పైగా బ్రాండ్లు.. ఫ్లాట్‌ 50% తగ్గింపు.. అన్‌బాక్సింగ్‌ హ్యాపీనెస్‌సేల్ ప్రారంభం

తనివితీరా షాపింగ్‌ చేసేందుకు తగిన సయయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇనార్బిట్‌ మాల్‌ యొక్క అన్‌బాక్సింగ్‌ హ్యాపీనెస్‌సేల్‌ ఇప్పుడు ప్రారంభమైంది. జూలై 01–03 తేదీలలో దాదాపు 50కు పైగా బ్రాండ్లపై ఫ్లాట్‌ 50% తగ్గింపును అందిస్తున్నారు. ఈ మూడు రోజులూ మాల్‌ రాత్రి 10 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఈ ఫ్లాట్‌ 50% తగ్గింపు అమ్మకాలు వారాంతంలో మాత్రమే అందుబాటులో ఉన్నా, అన్‌ బాక్సింగ్‌ హ్యాపీనెస్‌ సేల్‌ మాత్రం జూలై 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.

50% రాయితీని 50కు పైగా బ్రాండ్లపై అందిస్తున్నారు. ఈ బ్రాండ్లలో ప్రీమియం అప్పెరల్‌, బ్యాగ్స్‌, ఫిట్‌నెస్‌, ఫుట్‌వేర్‌, యాక్సససరీ బ్రాండ్లు అయినటువంటి హెచ్‌ అండ్‌ ఎం, ఫరెవర్‌ న్యూ, స్కెచర్స్‌, పూమా, చార్లెస్‌ అండ్‌ కీత్‌, బాత్‌, బాడీ వర్క్‌, లాకొస్టె, ఆల్డో వంటివి ఉన్నాయి.

ఫ్లాట్‌ 50% తగ్గింపును లైఫ్‌స్టైల్‌, షాపర్స్‌ స్టాప్‌, పాంటాలూన్స్‌, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌, మ్యాక్స్ ల‌లో అందిస్తున్నారు. వాచ్‌ ప్రేమికులు రమేష్‌ వాచ్‌ కో, కమల్‌ వాచ్‌ కో, ఫాసిల్ బ్రాండ్‌ల‌లో ఆకర్షణీయమైన రాయితీలను పొందవచ్చు.

రివార్డ్‌ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంటుంది. మాల్‌ ప్రవేశ ద్వారం వద్ద నున్న బార్‌కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు పాయింట్లను బహుమతిగా అందిస్తారు. వాటిని షాపింగ్‌ సమయంలో రిడీమ్‌ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. అలసిపోయేంత వరకూ మనసారా షాపింగ్‌ చేయండి. మీరు కొనాలనుకున్నవన్నీ ఈ మూడు రోజుల ఆఫర్ల ఉత్సవంలో కొనుగోలు చేయండి.
















Next Story