అర్థం చేసుకోండి.. యుద్ధం సమయంలో కూడా రైలు ఆగలేదు

By అంజి  Published on  24 March 2020 8:06 PM GMT
అర్థం చేసుకోండి.. యుద్ధం సమయంలో కూడా రైలు ఆగలేదు

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 536కు చేరింది. మొత్తం 21,804 మంది నుంచి నమునాలు సేకరించామని ఐసీఎంఆర్‌ తెలిపింది.

కరోనా కేసుల పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా ఇండియన్‌ రైల్వే సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్‌ రైల్వే ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. దేశాన్ని అతలాకుతలం చేసే యుద్ధ సమయంలో కూడా తమ సేవలు ఆపలేదని.. అయితే ప్రస్తుతం దేశమంతటా రైలు సేవలు నిలిచాయంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని ఇండియన్‌ రైల్వే శాఖ ట్వీట్‌ చేసింది. ఈ మేరకు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని పేర్కొంది.



ఈ నెల 31 వరకు గూడ్స్‌ రైళ్లు మినహా అన్ని రైళ్లను రద్దు చేశారు. కాగా మంగళవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ మరో 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదిక చర్యలు చేపట్టింది. దేశ ప్రజలందరికి ప్రత్యేక సలహాలు, సూచనలు జారి చేసింది. కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే ప్రధాని మోదీ సూచించారు.

Also Read: తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు.. అది కూడా

ఇక ప్రపంచ వ్యాప్తంగా 16,869 మంది మృతి చెందారు. 3,78,927 మంది కరోనా బారినపడ్డారు.

Next Story