రెండో టెస్టు : రెండో టెస్టులోనూ సౌతాఫ్రికాపై టీమిండియా అదరగొడుతోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ డబుల్‌ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 336 బంతుల్లో 33 ఫోర్ లు, 2 సిక్స్‌ల‌తో తన అత్యధిక స్కోరును తానే అధిగ‌మించాడు. కోహ్లీకి తోడుగా జడేజా కూడా 91 పరుగులతో మెరిశాడు. కాగా టీమిండియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు మొదటిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఉమేష్‌ యాదవ్‌కు రెండు, షమి ఒక వికెట్‌ లభించింది. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 36 పరుగుల చేసింది. క్రీజులో బ్రూయిన్‌ (20), నోర్జె (2) ఉన్నారు. ఇంకా టీమిండియా కంటే 565 పరుగుల వెనుకంజలో సౌతాఫ్రికా జట్టు ఉంది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.