ప్రపంచంలో భారత్‌కు మూడో స్థానం
By సుభాష్ Published on 19 Dec 2019 3:52 PM ISTముఖ్యాంశాలు
ఆర్టికల్స్ ప్రచురణలో భారత్‌కు మూడో స్థానం
మొదటి స్థానంలో చైనా
రెండో స్థానం అమెరికా
జాబితాను వెల్లడించిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్
వరల్డ్ వ్యాప్తంగా సైన్స్, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధిచిన అత్యధిక ఆర్టికల్స్ ప్రచురించిన దేశాల జాబితా వెల్లడైంది. అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించిన జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 2008లోసైన్స్, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించిన 17.5 లక్షల ఆర్టికల్స్ ప్రచురితం కాగా,2018 నాటికి ఆ సంఖ్య 25.5 లక్షలకు చేరిందని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పేర్కొంది.
ఎన్‌ఎస్‌ఎఫ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే.. అత్యధిక ఆర్టికల్స్ ప్రచురితమైన దేశాలు చైనా, అమెరికా, భారత్‌లు ఉన్నాయి. ఆ తర్వాత ఇతర దేశాలు ఉన్నాయి. కాగా, ఆర్టికల్స్ ప్రచురించిన జాబితాలో భారత్‌కు మూడో స్థానం దక్కింది. భారత్ లో 2008లో48,998 ఆర్టికల్స్ ప్రచురితం కాగా, 10.73 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఆ సంఖ్య 2018 సంవత్సరం నాటికి 1.35 లక్షలకు చేరింది. ఇక సైన్స్ ఆర్టికల్స్‌లలో చైనా 20.67 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది. వార్షిక వృద్ధిరేటు 7.81 శాతంగా నమోదై, సైన్స్ ఆర్టికల్స్‌లో అమెరికా ఏడాదికి 0.71 శాతం వృద్ది సాధించింది. ఇక సైన్స్ ఆర్టికల్స్‌లో టాప్ 10 జాబితాను విడుదల చేసింది ఫౌండేషన్.
ఆర్టికల్స్ లలో టాప్-10 దేశాలు ఇవే..
1. చైనా -5,28,263
2. అమెరికా - 4,22,808
3. భారత్ - 1,35,788
4. జర్మనీ -1,04,396
5. జపాన్ - 98,793
6. యూకే - 97,681
7. రష్యా - 81,579
8. ఇటలీ -71,240
9. దక్షిణ కొరియా - 66,376
10. ఫ్రాన్స్ - 66,352