భారత్ లో 8000 దాటిన కరోనా కేసులు..అత్యధికంగా మహారాష్ట్రలో
By రాణి Published on 12 April 2020 6:57 AM GMTభారత్ కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజులు గడిచే కొద్దీ వందల్లో కేసులు, పదుల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం విడుదల చేసిన కరోనా తాజా హెల్త్ బులెటిన్ లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8356 దాటగా 273 మంది మరణించారు. మరో 716 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 1761 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 127 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
Also Read : 1700 కిలోమీటర్లు..16 గంటలు..7 రోజులు
మహారాష్ట్ర తర్వాత వరుసగా ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఢిల్లీలో 1069 పాజిటివ్ కేసులుండగా 19 మంది మృతి చెందారు. అదేవిధంగా తమిళనాడులో 969 కేసులుండగా 10 మంది మృతి చెందారు. రాజస్థాన్ లో 700 కేసులు నమోదవ్వగా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మధ్యప్రదేశ్ లో 532, తెలంగాణలో 504, ఉత్తరప్రదేశ్ లో 452, గుజరాత్ లో 432, ఆంధ్రప్రదేశ్ 381, కేరళ 364, కర్ణాటక 214, జమ్మూకాశ్మీర్ 207, హర్యానా 177, పంజాబ్ 151, పశ్చిమ బంగాల్ 134, బీహార్ 63, ఒడిషా 50, ఉత్తరాఖండ్ 35, హిమాచల్ ప్రదేశ్ 32, అస్సాం 29, చండీఘర్ 19, చత్తీస్ ఘడ్ 18, లడఖ్ 15, అండమాన్ అండ్ నికోబార్ 11, పుదుచ్చేరి గోవా రాష్ట్రాల్లో చెరో 7 కేసులు, త్రిపురలో 2, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కరోనా కేసులు నమోదయ్యాయి. రానున్న మూడ్రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ మూడ్రోజులు కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : దారుణం: అమెరికాలో 40 భారతీయులు మృతి