దారుణం: అమెరికాలో 40 భారతీయులు మృతి

By సుభాష్  Published on  12 April 2020 6:13 AM GMT
దారుణం: అమెరికాలో 40 భారతీయులు మృతి

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా జన్మస్థలంగా ఉన్న ఈ మహమ్మారికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అలాంటి ఆగ్రరాజ్యం అమెరికా ఉక్కిరిబిక్కరవుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాము. ఎంత పోరాటం చేస్తున్నా.. మృత్యుఘోష మాత్రం తప్పడం లేదు.

ఇక అమెరికాలో మాత్రం గంటగంటకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18030 మంది మృతి చెందారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 20వేలుపైగా చేరిపోయింది. ఇప్పటి వరకూ అత్యధికంగా ఇటలీలో 19,465 కరోనా మరణాలు సంభవించగా, అగ్రరాజ్యం ఆ మార్క్‌ను అధిగమించింది.

కరోనా బారిన అమెరికాలో ఉంటున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వారిలో సుమారు 40 మంది మృతి చెందారు.

ఇక న్యూజెర్సీలో ఉంటన్న 400 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ తేలింది. అమెరికాలో ఉంటున్న వెయ్యి మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు భారతీయ సంఘాల నాయకులు చెబుతున్నారు.

అమెరికాలో వైరస్‌ సోకిన తర్వాత ప్రతి రోజు దాదాపు వెయ్యి మంది వరకు మృత్యువాత పడగా, ఏప్రిల్‌ 7వ తేదీ తర్వాత ప్రతి రోజు దాదాపు 2వేల వరకూ మృత్యువాత పడుతున్నారు. సాంకేతికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన అమెరికా సైతం కరోనాను ఏమి చేయలేకపోతోంది. కరోనాను ఎలాంటి సమయంలోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్‌ మాటలు తలకిందులయ్యాయి. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన పడిపోతోంది అమెరికా.

Next Story