భారత్-చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. యుద్ధానికి దారి తీసేనా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Sept 2020 5:50 PM ISTభారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తోందని భారత్ ఆరోపిస్తుంటే.. చైనా మాత్రం భారత్ కాల్పులకు తెగబడుతోందని వ్యాఖ్యలు చేస్తోంది.
అర్ధరాత్రి కాల్పులు జరిగడానికి యని, భారత ఆర్మీయే ఈ చర్యలకు పాల్పడిందని చైనా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కాల్పులకు చైనానే కారణం అని చెబుతోంది. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పులకు తెగబడ్డం లేదని ప్రకటనను విడుదల చేసింది.
వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే క్రమంలో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందని.. చైనా బలగాలు మాత్రం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని భారత్ తెలిపింది.
సోమవారం రాత్రి కాల్పులకు తెగబడిన చైనా సైనికులు మంగళవారం రెజాంగ్ లా హైట్స్ వద్ద భారత దళాలతో తలపడ్డారు. పర్వత ప్రాంతంపై ఉన్న భారత దళాలను చైనా సైనికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల వద్ద తుపాకులు వాడరాదన్న ఒప్పందాలకు తూట్లుపొడుస్తూ సోమవారం రాత్రి లడఖ్‌లో చైనా సైనికులు కాల్పులు జరపగా.. భారత దళాలు అడ్డుకున్నాయి. చైనా ప్రవర్తనను తీవ్రంగా పరిగణిస్తోంది భారతప్రభుత్వం. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది.