చైనాకు గట్టి మెసేజ్ ఇచ్చారుగా.. టిబెట్ సైనికుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ నేత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 10:29 AM GMT
చైనాకు గట్టి మెసేజ్ ఇచ్చారుగా.. టిబెట్ సైనికుడి అంత్యక్రియలకు హాజరైన బీజేపీ నేత

లేహ్/న్యూ ఢిల్లీ : టిబెటన్ సైనికుడు 'ఎనిమా టెంజిన్' అంతిమసంస్కారాలు భారత ఆర్మీ, టిబెటన్ సైనికుల మధ్య నిర్వహించారు. భారత ఆర్మీ సమక్షంలో నడుస్తున్న వన్-సీక్రెట్ స్పెషల్ ఫ్రాంటీర్ ఫోర్స్ (ఎస్.ఎఫ్.ఎఫ్.) యూనిట్ కు చెందిన టిబెటన్ సైనికులలో ఎనిమా టెంజిన్ కూడా ఒకరు. దక్షిణ పాంగాంగ్ వద్ద ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టడం వలన ఎనిమా మరణించాడు.

ఈ కార్యక్రమానికి బీజేపీ నేత రామ్ మాధవ్ హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసిన రామ్ మాధవ్ ఆ తర్వాత వాటిని డిలీట్ చేశారు. చైనా-భారత్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘటనల మధ్య రామ్ మాధవ్ టిబెటన్ సైనికుడి అంతిమసంస్కారాలకు హాజరయ్యిన కారణంగా చైనాకు గట్టి మెసేజ్ ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా భారత్-చైనా దేశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు.

స్పెషల్ ఫ్రాంటీర్ ఫోర్స్ ను 14 నవంబర్ 1962లో స్థాపించారు. స్పెషల్ ఫోర్స్ ను అప్పట్లో స్థాపించడం జరిగింది. టిబెట్-భారత్ సరిహద్దుల్లో సేవలు అందిస్తో ఉంది. టిబెటన్ రెఫ్యూజీల సంక్షేమం కోసం పోరాడుతూ ఉంది. 3500 మందికి పైగా సైనికులు ఇందులో ఉన్నారు.

గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న భారత దళాలు చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి భారీగా రాకెట్ లాంచర్లు మోహరించాయి. పర్వత ప్రాంతాల యుద్ధ రీతుల్లో ఆరితేరిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ చైనా బలగాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. భారత బలగాలను చూడగానే చైనా దళాలు బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపాయి. భారత బలగాలు తమ వద్ద ఉన్న అత్యాధునిక మిలన్ యాంటీ ట్యాంకు గైనేడ్ మిసైళ్లను, కార్ల్ గుస్తోవ్ రాకెట్ లాంచర్లను పొజిషన్ లో ఉంచడమే కాకుండా.. ప్రతిగా భారత బలగాలు గాల్లోకి కాల్పులు జరపడంతో చైనాకు విషయం అర్థమైంది. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ దగ్గర ఉన్న ఆయుధాలను చూసి చైనా సైనికులు వెనుదిరిగారు.

Next Story