భారత్ - చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత జవాన్లు వీరే

By సుభాష్  Published on  17 Jun 2020 4:40 PM IST
భారత్ - చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత జవాన్లు వీరే

భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఇక తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు కూడా ఉన్నారు. అలాగే ఈ ఘర్షణలో చైనాకు చెందిన 43 మంది వరకు సైనికులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.కానీ చైనా మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక భారత్‌కు చెందిన ముగ్గురు కల్నల్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు ప్రకటించిన సైన్యం.. తీవ్రంగా గాయపడ్డ మరో 17 మంది మరణించినట్లు తెలిపింది.

వీరమరణం పొందిన జవాన్లు వీరే..

♦ కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు, సూర్యాపేట, తెలంగాణ

♦ నాదూరాం సోరెన్‌, ఒడిశా

♦ మన్‌దీప్‌సింగ్‌, పటియాలా, పంజాబ్‌

♦ సునీల్‌ కుమార్‌, బీహార్‌

♦ సత్నంసింగ్‌, గురుదాన్‌పూర్‌, పంజాబ్‌

♦ పళని, మదురై, తమిళనాడు

♦ బిపుల్‌ రాయ్‌, మీరట్‌నగరం, ఉత్తరప్రదేశ్‌

♦ కుందన్‌కుమార్, జార్ఖండ్‌

♦ గణేష్‌, ఛత్తీస్‌గఢ్‌

♦ చంద్రకాంత్‌, ఒడిశా

♦ దీపక్‌ కుమార్‌, మధ్యప్రదేశ్‌

♦ రాజేష్‌, పశ్చిమబెంగాల్‌

♦ జైకిశోర్‌సింగ్‌, బీహార్‌

♦ అంకుష్‌, హమిర్‌పూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌

♦ గురుతేజ్‌, పంజాబ్‌

♦ కుందన్‌కుమార్‌, బీహార్‌

♦ గుర్వింద్‌సింగ్‌, సంగ్రూర్‌, పంజాబ్‌

♦ చందన్‌కుమార్‌, భోజ్‌పూర్‌, బీహార్‌

♦ అమన్‌ కుమార్‌, బీహార్‌

Next Story