హర్యానా: ప్రధాని మోదీ మంగళవారం హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చార్ఖీ దాద్రీలో మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక, క్షేత్రస్థాయి అంశాలను ప్రసావిస్తూ మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బేటీ బచావో..బేటీ పడావో నినాదాన్ని పాటిస్తున్న ఏకైక రాష్ట్రం అని హర్యానా అని మోదీ అన్నారు. హర్యానాలో క్రమంగా బాలికల సంఖ్య పెరుగుతోందని.. 2022నాటికి ఇళ్లు లేని పేదలు ఉండరని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్నివర్గాల వారికి సామాజిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని మోదీ వ్యాఖ్యనించారు. హర్యానా ఆడపిల్లలు ఎంత సమర్థులో దంగల్‌ సినిమా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. గతవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా దంగల్‌ సినిమాను చూశానని చెప్పారని మోదీ అన్నారు. గత 70 ఏళ్లుగా హర్యానాకు దక్కాల్సిన నీళ్లు పాక్‌కు పోయేవని.. ఆ నీటిని హర్యానాకు దక్కేలా చేశామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటని మోదీ పేర్కొన్నారు. యువతకు, మహిళకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని మోదీ అన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.