ఆయుష్‌ ఉత్పత్తులను పెంచండి.!

By అంజి  Published on  28 March 2020 12:47 PM GMT
ఆయుష్‌ ఉత్పత్తులను పెంచండి.!

ఢిల్లీ: ఆయుష్‌ ఉత్పత్తులను పెంచాలని ఉత్పత్తిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆయుష్‌ ఉత్పత్తులను పెంచాలన్నారు. ప్రధాని కార్యాలయంలో శనివారం నాడు ఆయుర్వేద వైద్యులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా అవసరమైన శానిటైజర్లు, ఇతర ఔషధాలను ఎక్కువ మొత్తంలో తయారు చేయాలన్నారు. తమ పరిధిలో ఉన్న వనరులను వాడుకొని ఉత్పత్తిని పెంచాలని సూచించారు.

Also Read: కరోనా బాధితుల వివరాలు షేర్ చేస్తే జైలుకే..

ఇంటివద్దనే యోగా కార్యక్రమం పేరిట యోగాపై ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అవగాహన కల్పిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తోందని తలిపారు. ఈ వైరస్‌ను అంతం చేసే శక్తి కూడా భారతీయ ఆయుర్వేద వైద్యానికి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యనించారు.

Also Read: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచుతున్న ‘కోల్ఫాక్’ డీల్‌.. తాజాగా మ‌రో ఆట‌గాడు ఔట్‌..

ఐసీఎమ్‌ఆర్‌, సీఎస్‌ఐర్ పరిశోధనా సంస్థలు‌, ఆయుష్‌ శాస్త్రవేత్తలు కలిసి కరోనా వైరస్‌ నివారణ మార్గం కనుగొనాలని ఆయన కోరారు. అవసరమైతే ప్రైవేట్‌ ఆయుర్వేద వైద్యులను కూడా ఆయుష్‌ ద్వారా భాగస్వాములను చేస్తామన్నారు. ప్రజలకు ఆయుర్వేద వైద్యం, భారతీయ సంప్రదాయ వైద్యం గురించి అవగాహన కల్పించేందుకు టెలిమెడిసిన్‌ మార్గాన్ని కూడా వినియోగించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.

Next Story