‘అనధికార’ నిర్మాణాలకు షాక్.. కేసీఆర్ సర్కారు తెచ్చిన కొత్త రూల్స్ ఇవే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Aug 2020 7:00 AM GMTఅక్రమమా? సక్రమమా? అన్న దానితో సంబంధం లేకుండా తమ వద్దకు వచ్చిన వాటిని రిజిస్ట్రేషన్లు చేయటమే రిజిస్ట్రేషన్ల శాఖ పనిగా ఉంటుంది. ఈ కారణంతోనే.. అక్రమ నిర్మాణాలు.. అక్రమ లేఔట్లు పెద్ద ఎత్తున పెరగటానికి కారణం. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. రిజిస్ట్రేషన్ల కారణంగా వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ విషయాన్ని పట్టించుకునే వారు కాదు. దీన్ని అసరాగా చేసుకొని పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలకు తెర తీసేవారు. నిబంధనల ప్రకారం మూడు అంతస్థులకు అనుమతులు తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించటం.. కొన్ని సందర్భాల్లో ఆరు అంతస్తులు వరకు ఈ అక్రమాలు వెళ్లిపోయాయి.
దీంతో.. ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన అభివృద్ధి జరగని పరిస్థితి. మౌలిక వసతుల లేమితో పాటు.. పలు సమస్యలకు కారణంగా మారింది. ఇలాంటి వాటికి చెక్ చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుంది. గతానికి భిన్నంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు.. లేఔట్లకు సంబంధించిన ఆస్తులకు రిజిస్ట్రేషన్లను చేయరు. పక్కా అనుమతులు ఉన్న వాటికి మాత్రమే చేస్తారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిర్దేశాల్ని చూస్తే..
తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 172 (16),178 (3) ప్రకారం నిర్దేశిత నిర్మాణ అనుమతి లేని భవనాలు, భవనంలోని ఒకభాగం (ప్లాట్), ఇతర నిర్మాణాన్ని రిజిస్ట్రేషన్ చేయరాదు.
- మున్సిపాలిటీ అనుమతి ఇచ్చిన డిజైన్ మేరకు నిర్మాణం లేకపోతే రిజిస్ట్రేషన్ చేయొద్దు.
- పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 113(8)ను అనుసరించి అనుమతి లేని లేఔట్లలోని భూమి లేదా భవనంలో కొంతభాగాన్ని రిజిస్ట్రేషన్ చేయరు.
- గ్రామకంఠంలోని స్థలాల్లో ఉన్న భవనాలు. నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేయొచ్చు.
- అనధికార, అక్రమ లేఔట్ల నిరోధక చట్టం-2015 ప్రకారం అనధికార లేఔట్లు, ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలి.
- ఒకవేళ రెగ్యులరైజ్ చేసుకోకపోతే అలాంటి వాటిని రిజిస్ట్రేషన్‌శాఖ నిషేధిత ఆస్తులలిస్టులో పెడుతుంది.
- కామన్ బిల్డింగ్ రూల్స్‌ను అనుసరించి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మించిన భవనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి.
- అన్ని అనుమతులున్న ప్లాట్లు, అధికారిక లేఔట్లు, గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద రెగ్యులరైజ్ చేసిన ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి.
- గతంలో రిజిస్ట్రేషన్ అయి ఉండి.. అది కనుక అనధికార లేఔట్ అయి ఉంటే.. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయరు.
- గృహాలు, భవనాలు, అపార్ట్‌మెంట్లు ఏవైనా సరే అధికారికంగా అనుమతించిన ప్లాన్ ప్రకారం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి.
- ఒకవేళ అనధికారికంగా కట్టి.. ఆ తర్వాత బీఆర్‌ఎస్ (బిల్డింగ్ రిజిస్ట్రేషన్ స్కీమ్), బీపీఎస్ (బిల్డింగ్ పినలైజేషన్ స్కీమ్) కింద ప్రొసీడింగ్స్ తీసుకున్న నిర్మాణాలను సైతం రిజిస్ట్రేషన్ చేయొచ్చు.
- రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారిని అప్రూవ్డ్ లేఔట్, బిల్డింగ్‌ప్లాన్ పత్రాలను సమర్పించమని అడిగే అధికారం రిజిస్ట్రేషన్ అధికారులకు ఉంటుంది.
- అధికారికంగా అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మించిన భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు
- అనుమతి లేని భవనాలు, భవనంలోని ఒకభాగం (ప్లాట్), ఇతర నిర్మాణాన్ని రిజిస్ట్రేషన్ చేయరాదు.
- మున్సిపాలిటీ అనుమతిచ్చిన డిజైన్‌ను అనుసరించే నిర్మాణం ఉండాలి. లేనిపక్షంలో రిజిస్ట్రేషన్ చేయరు.
- అనుమతిలేని లేఅవుట్లలోని భూమి.. భవనంలో కొంత భాగాన్ని ఎవరు అమ్ముతున్నా దాన్ని రిజిష్టర్ చేయరు.