Fact Check : కాశ్మీర్ కు చెందిన ఐఏఎఫ్ పైలట్ హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ ను తీసుకొచ్చారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2020 10:59 AM GMT
Fact Check : కాశ్మీర్ కు చెందిన ఐఏఎఫ్ పైలట్ హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ ను తీసుకొచ్చారా..?

సామాజిక మాధ్యమాల్లో చాలా మంది నెటిజన్లు కాశ్మీర్ కు చెందిన ఐఏఎఫ్ పైలట్ హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ ను తీసుకొచ్చాడంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతూ వస్తున్నారు. http://www.greaterkashmir.com అనే వెబ్ సైట్ లో అందుకు సంబంధించిన కథనం కూడా వచ్చిందని చెబుతున్నారు. ఫ్రాన్స్ నుండి భారత్ కు విమానం నడపడం ఎంతో గొప్ప విషయమని అంటూ ఉన్నారు.





నిజ నిర్ధారణ:

హిలాల్ అహ్మద్ రాథర్ గొప్ప పైలట్లలో ఒకరు. ఆయన ఫ్రాన్స్ లో రఫేల్ విమానాలను పరీక్షించారు. భారత వాతావరణానికి ఈ విమానాలు సరిపోతాయా లేదా అన్నది కూడా హిలాల్ అహ్మద్ ఫ్రాన్స్ లో ఉండి తెలుసుకున్నారు. అంతేకానీ ఫ్రాన్స్ నుండి భారత్ కు రఫేల్ విమానాలను తీసుకునిరాలేదు.

హిలాల్ అహ్మద్ రాథర్ ఎయిర్ కమోడోర్ గా సేవలు అందిస్తూ ఉన్నారు. హిలాల్ దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాకు చెందిన వారు. రఫేల్ విమానాలను పరీక్షించే మొదటి బ్యాచ్ పైలట్లలో ఆయన కూడా ఒకరు. రఫేల్ యుద్ధ విమానాలు మొదటి బ్యాచ్ భారత్ కు త్వరగా రావడానికి ఆయన కూడా కారణమయ్యారు. భారత అవసరాలకు అనుగుణంగా రఫేల్ యుద్ధవిమానాల విషయంలో ఆయన మార్పులు చేయడంలో సహకరించారు.

ఈ విమానాలను ఎవరు నడిపారు అన్న విషయాన్ని పలు మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి. రఫేల్ యుద్ధ విమానాల్ని తీసుకొచ్చిన ఐదుగురు పైలెట్లు నెలకు పైనే ప్రత్యేక శిక్షణ తీసుకొని ఏడువేల కిలోమీటర్లు ప్రయాణించి.. అంబాలా వాయుసేన బేస్ కు చేరుకున్నారు. ఈ గ్రూపునకు కెప్టెన్ గా వ్యవహరించారు ‘‘హర్ కిరత్ సింగ్’’. అత్యుత్తమ శౌర్యచక్ర పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన కమిట్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. పన్నెండేళ్ల క్రితం ఒక మిషన్ లో ఆయన నడుపుతున్న ఏయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలోనూ ఆయన చాలామంది ప్రాణాల్ని కాపాడటం గమనార్హం. ఆయన తండ్రి వాయుసేనలో లెఫ్టినెంట్ కల్నల్ గా సేవలందించారు.

మరొకరు ‘‘అభిషేక్ త్రిపాఠి’’. రాజస్థాన్ కు చెందిన ఆయన వాయుసేలో వింగ్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. చదువుకునే సమయంలో రెజ్లర్. ఇతడి తండ్రి బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి ఐటీ విభాగంలో సేవలు అందించారు. మంచి స్పోర్ట్స్ మ్యాన్‌ గా పేరుంది. మూడో వ్యక్తి ‘‘మనీశ్ సింగ్’’. యూపీలోని చిన్న గ్రామం నుంచి వింగ్ కమాండ్ స్థాయికి చేరుకున్నారు. వీరి కుటుంబంలో చాలామంది ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పని చేశారు. సైనిక్ స్కూల్లో చదివిన మనీశ్ 2003లో ఎయిర్ ఫోర్సులో జాయిన్ అయ్యారు. నాలుగో వ్యక్తి ‘‘రోహిత్ కఠారియా’’. హర్యానాకు చెందిన ఇతడి బ్యాక్ గ్రౌండ్ మంచి స్ఫూర్తిని కలిగిస్తుంది. ఆయన తండ్రి ఆర్మీ అధికారి. కల్నల్ గా పదవీ విరమణ పొంది.. సైనిక్ స్కూల్ కు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. రోహిత్ తండ్రిని వారి సొంతూరులో చాలామంది రోల్ మోడల్ గా వ్యవహరిస్తారు. ఐదో వ్యక్తి "అరుణ్ కుమార్".. ఆయన వింగ్ కమాండర్ గా సేవలు అందిస్తూ ఉన్నారు.

అందుకు సంబంధించిన వీడియో న్యూస్ మీటర్ కు లభించింది.

https://zeenews.india.com/video/india/meet-rafale-pilots-who-flew-jets-to-india-2299538.html

కమోడోర్ హిలాల్ అహ్మద్ రాథర్ రఫేల్ విమానాలను ఫ్రాన్స్ నుండి భారత్ కు తీసుకుని వచ్చారన్న విషయంలో నిజం లేదు.

Next Story