Fact Check : ఆ వీడియోలో ఉన్నది కిషోర్ కుమార్ మనవరాలు ముక్తిక గంగూలీనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2020 11:59 AM GMT
Fact Check : ఆ వీడియోలో ఉన్నది కిషోర్ కుమార్ మనవరాలు ముక్తిక గంగూలీనా..?

బాలీవుడ్ సాంగ్ ను పాడుతున్న ఓ చిన్నారి వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. కిషోర్ కుమార్ మనవరాలు 14 సంవత్సరాల ముక్తిక గంగూలీ (అమిత్ కుమార్ కుమార్తె) అద్భుతంగా పాటలు పాడుతోంది.. తన తాత పేరు నిలబెడుతోంది అంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలనాటి లెజెండరీ ప్లే బ్యాక్ సింగర్ మనవరాలు అనగానే పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.

M1

‘Kishore kumar’s 14-year-old granddaughter Muthika Ganguly (daughter of Amit kumar) utterly charming. Carrying forward her grandfather’s legacy’. అంటూ ఫేస్ బుక్ లో కూడా ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది కిషోర్ కుమార్ మనవరాలన్నది 'అబద్ధం'.

‘Muthika Ganguly’(ముతిక గంగూలీ) అన్న పేరును గూగుల్ లో సెర్చ్ చేయగా 2015 కు చెందిన ఆర్టికల్స్ కు సంబంధించిన సమాచారం చూడొచ్చు. కిషోర్ కుమార్ కుమారుడు అమిత్ కుమార్ 'బాబా మేరే' ఆల్బమ్ ను రిలీజ్ చేసిన సమయంలో ఆమెను చూడొచ్చు. ఆమె పేరు Muktika Ganguly (ముక్తిక గంగూలీ) వైరల్ అవుతున్న పోస్టులో చెప్పినట్లుగా 'ముతిక గంగూలీ' కాదు.

2015 లో 10 సంవత్సరాల ముక్తిక గంగూలీ బాబా మేరే ఆల్బమ్ ద్వారా పాటలు పాడడంలో అరంగేట్రం చేసింది. కిషోర్ కుమార్ కొడుకులు అమిత్ కుమార్, సుమీత్ కుమార్ లు కలిసి మ్యూజిక్ సంస్థ 'కుమార్ బ్రదర్స్ మ్యూజిక్(కె.బి.ఎం.)' ను తన తండ్రికి గుర్తుగా స్థాపించారు. ఈ ఆల్బమ్ లో ముక్తిక గంగూలీ ఒక పాటను పాడింది. ఆ మ్యూజిక్ వీడియోలో ముక్తిక, అమిత్ లను చూడొచ్చు. 10 సంవత్సరాల బాలిక తన తాతను కలలో ఎలా కలిసిందో చూడొచ్చు.

కిషోర్ కుమార్ కుమారుడు అమిత్ కుమార్ ఫేస్ బుక్ పేజీలో ముక్తికకు చెందిన ఫోటోలు చూడొచ్చు.

వైరల్ పోస్టులో ఉన్న అమ్మాయికి, కిషోర్ కుమార్ మనవరాలు ముక్తిక గంగూలీకి ఎటువంటి సారూప్యత లేదు. కాబట్టి వీడియోలో ఉన్న అమ్మాయి 'ముక్తిక గంగూలీ కాదు'.

ఈ వైరల్ పోస్టు కింద ఆమె ముక్తిక గంగూలీ కాదంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఆమె 'అనన్య సబ్నిస్' అనే ముంబైకి చెందిన సింగర్ అని తెలుస్తోంది.

Ananya Sabnis (అనన్య సబ్నిస్) అనే కీవర్డ్ ను ఉపయోగించగా గూగుల్ లో ఎన్నో వీడియోలు లభించాయి. పలు ప్రముఖ పాటలు పాడిన వీడియోలు యుట్యూబ్ లో కనిపించాయి.

‘Ananya Sabnis – Deewana hua badal’ అనే టైటిల్ లో తో ‘About today’ అనే యూట్యూబ్ పేజీలో వైరల్ అవుతున్న వీడియోను పోస్టు చేశారు.

న్యూస్ మీటర్ అనన్య సబ్నిస్ కు చెందిన ఫేస్ బుక్ పేజీని కూడా తెలుసుకుంది. అందులో తాను ప్రొఫెషనల్ స్టేజ్ ఆర్టిస్ట్ అని ఆమె తెలిపింది.

ముంబైకి చెందిన సింగర్ అనన్య సబ్నిస్ ను లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ మనవరాలు ముక్తిక గంగూలీ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదు.

Next Story