యువతి కిడ్నాప్ క‌ల‌క‌లం.. 100మందితో వాహ‌నాల్లో వచ్చి సినిమా స్టైల్లో..

Young Woman kidnapped in Rangareddy District. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది.

By Medi Samrat  Published on  9 Dec 2022 12:50 PM GMT
యువతి కిడ్నాప్ క‌ల‌క‌లం.. 100మందితో వాహ‌నాల్లో వచ్చి సినిమా స్టైల్లో..

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక ఆదిభట్లలో సినిమా స్టైల్లో ఓ గ్యాంగ్ యువ‌తి ఇంటి మీదికొచ్చి నానా బీభత్సం సృష్టించింది. దాదాపు 100మంది గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను ఎత్తుకుపోయారు. అడ్డువచ్చినవారిపై క‌ర్ర‌ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. యువతిని ఎత్తుకెళ్తున్న‌ సమయంలో తల్లిదండ్రులు అడ్డుకోగా.. వారిని కొట్టి యువతిని తీసుకెళ్లిపోయారు ఆ కిడ్నాప్ గ్యాంగ్. యువతి తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు వచ్చి గ్యాంగ్ ను అడ్డుకునేందుకు యత్నించగా.. వారిపై కూడా దాడికి తెగ‌బ‌డ్డారు. సినిమా స్టైల్లో జరిగిన ఈ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కిడ్నాప్ గ్యాంగ్ యువతి ఇంటిలో విధ్వంసం సృష్టించారు. కంటికి కనిపించిన వస్తువులను ధ్వంసం చేశారు. కార్లతో పాటు ఇంటిలో ఉన్న ప‌ర్నీచ‌ర్‌ కూడా ధ్వంసం చేశారు. ఈ కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కిడ్నాప్ పై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువతి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. కిడ్నాప్ చేసింది మిస్టర్ టి టైమ్ ఓనర్ నవీన్ రెడ్డి అనే వ్యక్తి అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో నవీన్ రెడ్డి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబందించి పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story