నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. యువ‌తి అరెస్ట్‌

హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు యువతిని పట్టుకున్నారు.

By Medi Samrat  Published on  29 Jan 2024 1:09 PM GMT
నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. యువ‌తి అరెస్ట్‌

హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు యువతిని పట్టుకున్నారు. ఆమె వద్ద నుండి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెతో పాటు ఉన్న మరో యువకుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. పోలీసుల విచారణలో యువ‌తి టాలీవుడ్‌కు చెందిన‌ ఒక యంగ్ హీరో ప్రేయసిగా తేలింది. ఎస్ఓటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే ఎస్ఓటి బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగానే ఓ యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న క్రమంలో యువతి టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో ప్రేయసిగా గుర్తించారు.

ప‌ట్టుబ‌డిన యువ‌తిని లావణ్యగా గుర్తించారు. యువతితో పాటు ఉనీత్ రెడ్డి అనే యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ మ‌త్తుప‌దార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి హ్యాండ్ బ్యాగ్ లో డ్రగ్స్ దొరికిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. గోవా నుండి ఆ డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. లావణ్య సంగీతం టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్ ప్యాకెట్లు ఇచ్చినట్లుగా లావణ్య విచార‌లో వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తుంది. పక్కా సమాచారంతోనే ఎస్వోటీ పోలీసులు లావణ్య ను తనిఖీ చేశారు. నార్సింగి పోలీసులు NDPS 22బీ, రెడ్ విత్ 8సి కింద కేసులు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు.

Next Story