కష్టపడి చదివాడు. మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాడు. 22 ఏళ్లకే నెలకు రూ.4.83 జీతం. అయితే.. ఆ ఉద్యోగంలో చేరే లోపే హఠాన్మరణం చెందాడు. గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ కట్టా చంద్రశేఖర్ రెడ్డి పెద్ద కుమారుడు కట్టా అభిజిత్ రెడ్డి వరంగల్‌లోని నిట్‌లో చదువుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీ సౌదీ అరామ్‌కోలో కెమికల్ ఇంజినీర్‌గా జాబ్ వచ్చింది. ఏడాదికి 70వేల అమెరికన్ డాలర్లు( మన కరెన్సీలో రూ.58లక్షలు). వచ్చే నెలలోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంది.
ఆదివారం రాత్రి టీవీలో ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూసి పడుకున్నాడు. అర్థరాత్రి ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయాడు. ఆ అలికిడి అతడి తమ్ముడు నిద్ర లేచాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుమారుడు కళ్లముందే మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పనూతల. అభిజిత్ హఠాన్మరణంపై మంత్రి హరీశ్‌రావు, ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.