సరూర్ నగర్ లో మరో దారుణం

Woman found murdered in home in Saroornagar. సరూర్ నగర్ లో నాగరాజు హత్యను మరిచిపోక ముందే మరో దారుణం చోటు చేసుకుంది

By Medi Samrat  Published on  7 May 2022 1:38 PM GMT
సరూర్ నగర్ లో మరో దారుణం

సరూర్ నగర్ లో నాగరాజు హత్యను మరిచిపోక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. శనివారం ఇక్కడి సరూర్‌నగర్‌లోని తన ఇంట్లో ఓ మహిళ హత్యకు గురైంది. ఆమెను పెంపుడు కొడుకు హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు భూదేవి (58) తన కుటుంబంతో కలిసి సరూర్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీలో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానితుడు సాయితేజ ఆమె విలువైన వస్తువులపై కన్నేశాడు. ఆమెను హత్య చేసి నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సరూర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it