నిర్మాత మోసం చేశాడంటూ.. గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట మహిళ హ‌ల్‌చ‌ల్‌

Woman Creates Ruckus at Geetha Arts Office. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట‌ ఓ మహిళ తీవ్ర కలకలం రేపింది. వివ‌రాళ్లోకెళితే..

By Medi Samrat
Published on : 14 July 2021 6:43 PM IST

నిర్మాత మోసం చేశాడంటూ.. గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట మహిళ హ‌ల్‌చ‌ల్‌

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ గీతా ఆర్ట్స్ ఆఫీసు ఎదుట‌ ఓ మహిళ తీవ్ర కలకలం రేపింది. వివ‌రాళ్లోకెళితే.. సునీత బోయ అనే మ‌హిళ మలక్ పేట ప్రాంతంలో పుచ్చకాయలు అమ్ముతూ నివ‌సిస్తోంది. అయితే.. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని.. బలవన్మరణానికి పాల్పడుతానంటూ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట హంగామా సృష్టించింది. దీంతో గీతా ఆర్ట్స్ ఆఫీసు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సునీత మానసిక పరిస్థితి బ‌గోలేద‌ని పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు.

ఇదిలావుంటే.. నిర్మాత బన్నీ వాసుపై సునీత ఆరోపణలు చేయడం ఇదే మొద‌టిసారి కాదు. సినిమా అవకాశాలు ఇప్పిస్తాన‌ని బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ ఆమె పలుమార్లు ఆరోపణలు చేశారు. దీంతో బన్నీ వాసు, ఆయన సంబంధీకులు సునీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను పలుమార్లు జైలుకు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి కూడా తరలించారు. అయితే.. బన్నీ వాసు తనను బెదిరిస్తున్నాడని.. ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ సునీత మరోసారి వీడియో రిలీజ్ చేయండంతో పాటు ఆఫీసు ఎదుట హ‌ల్‌చ‌ల్ చేసింది.


Next Story