హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల మధ్య, నగరంలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ వరద నీటిలో స్థానిక మహిళకు అరుదైన డెవిల్ ఫిష్ దొరికింది. దీన్ని సక్కర్‌మౌత్ క్యాట్ ఫిష్ అని కూడా అంటారు. ఆ చేపను పట్టుకున్న మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లోని సాయికృష్ణ నగర్ వాసులు వరద నీటిలో దొరికిన అరుదైన చేపలను చూసేందుకు మహిళ ఇంటికి క్యూ కట్టారు. సోమవారం కురిసిన వర్షానికి ఇది వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ మహిళ అరుదైన చేపను బకెట్‌లో నుంచి తీసి జనాలకు చూపిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అరుదైన చేపను చూసేందుకు స్థానికులు గుమిగూడారు.
తెలంగాణలో చాలా అరుదుగా ఈ చేప కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో గతంలో కూడా రాష్ట్రంలోని జలవనరుల్లో ఈ చేప కనిపించింది. ఇది ఇతర రకాల చేపలపై దాడి చేసి చంపేస్తూ ఉంటుంది. వీటిని మత్స్యకారులు పెంచడానికి ఇష్టపడరు. ఇది చాలా నష్టాలకు కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో స్థానికులు 'రాక్షసి' (దెయ్యం) అని పిలుస్తారు.