మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు బంద్‌

Wine shops will be closed for two days. 6వ తేదీ​సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయనున్నారు

By Medi Samrat  Published on  5 March 2023 5:52 PM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు బంద్‌

Wine shops will be closed for two days


మందుబాబులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్​లో ఈ నెల 6వ తేదీ​సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయనున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. హోలీ పండుగని దృష్టిలో పెట్టుకుని వైన్స్​షాపులను మూసి వేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా.. పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్​ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హోలీ సందర్భంగా మద్యం షాపులు ఓపెన్ చేసుకునేందుకు గతేడాది కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.


Next Story