'హైదరాబాద్ విమోచన దినోత్సవం' ప్రాముఖ్యతను తెలుసుకుందాం..!

What is Hyderabad's Liberation Day, its significance. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2022 8:49 AM GMT
హైదరాబాద్ విమోచన దినోత్సవం ప్రాముఖ్యతను తెలుసుకుందాం..!

సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. 75వ వార్షికోత్సవానికి గుర్తుగా ఏడాది పొడవునా ఉత్సవాలను ప్రారంభించడానికి బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించింది. టీఆర్ఎస్ కూడా ఏడాది పొడవునా వేడుకలను నిర్వహించాలని భావిస్తోంది. ఆ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా పిలవాలని ఎంఐఎం కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవం చుట్టూ వివిధ రాజకీయ పార్టీలు సందడి చేస్తున్న తరుణంలో, గత చరిత్రను తిరిగి చూసుకోవడం, విమోచన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ను స్వతంత్ర భారతదేశంలో విలీనమైనందుకు గుర్తుచేసే రోజుగా బీజేపీ హైదరాబాద్‌ విమోచన దినం అని చెబుతూ ఉంది. ఇక టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు జాతీయ సమైక్యతా దినోత్సవంగా పిలుస్తున్నాయి.

భారత స్వాతంత్య్రానికి ముందు, హైదరాబాద్ రాష్ట్రం బ్రిటీష్ ఇండియా భూభాగంలో ఉండేది. మూడు భాషా ప్రాంతాలతో కూడిన రాచరిక రాష్ట్రంగా ఉంది. తెలుగు మాట్లాడే తెలంగాణ (రాజధాని నగరం హైదరాబాద్‌తో సహా), మరాఠీ మాట్లాడే మరాఠ్వాడా.. కన్నడ మాట్లాడే ప్రజలు ఉన్న కొంచెం ప్రాంతం. ఇందులో ఎనిమిది తెలంగాణ జిల్లాలు, ఐదు మహారాష్ట్ర జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలు ఉన్నాయి. 1947లో, భారతదేశం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. దేశ విభజన జరిగినప్పుడు, అప్పటి రాచరిక రాష్ట్రాలకు యూనియన్ ఆఫ్ ఇండియాలో చేరడానికి లేదా స్వతంత్రంగా ఉండటానికి అవకాశం ఉంది. అప్పుడు ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకుంది.

తెలంగాణ సాయుధ పోరాటం కూడా 1946-51 మధ్య కాలంలో జరిగింది. రైతులు భూస్వామ్య ప్రభువులు, నిజాంల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్లను ఏర్పరచిన మజ్లిస్-ఇ-ఇత్తహుదీల్-ముసిల్మీన్ నాయకుడు ఖాసిం రజ్వీచే ఛాందసవాదం పెరగడానికి ఈ ప్రాంతం సాక్షిగా ఉన్న సమయం. మరో వైపు భారతదేశంలోకి కలిసిపోవాలని పెద్ద ఎత్తున ప్రజలంతా ఆకాంక్షించారు.

హైదరాబాద్‌లో తిరుగుబాటుదారులు కమ్యూనిస్ట్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారనే భయంతోనూ, జాతీయవాదులకు భయపడి.. భారతదేశం రజాకార్లను ఓడించి 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి చేసింది. తదనంతరం, నిజాం భారతదేశంలో చేరడానికి ఒక పత్రంపై సంతకం చేశాడు. 1948 సెప్టెంబర్ 17న, ఆపరేషన్ పోలో కింద సైనిక జోక్యం ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనం చేయబడింది.

Next Story
Share it