గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. జపాన్ లో ఉద్యోగాలు..!

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) జపాన్‌లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్ నర్సులకు శిక్షణ, రిక్రూట్‌మెంట్ కోసం డిసెంబర్ 13న హైదరాబాద్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహించనుంది.

By Medi Samrat  Published on  11 Dec 2024 1:45 PM GMT
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు.. జపాన్ లో ఉద్యోగాలు..!

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) జపాన్‌లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్ నర్సులకు శిక్షణ, రిక్రూట్‌మెంట్ కోసం డిసెంబర్ 13న హైదరాబాద్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఐటీఐ మల్లేపల్లి క్యాంపస్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.

జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM), లేదా నర్సింగ్‌లో డిప్లొమా, ఆక్సిలరీ నర్స్ మిడ్‌వైఫరీ (ANM), పారామెడికల్ లేదా ఫార్మాస్యూటికల్ కోర్సులు, ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు జపనీస్ భాషలో రెసిడెన్షియల్ శిక్షణ పొందుతారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూలో అభ్యర్థి ఎంపిక తర్వాత హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 1.50 లక్షల నుండి రూ. 1.80 లక్షల వరకు జీతం అందిస్తారు. మరింత సమాచారం కోసం 9704570248/94400520819/9573945684 నెంబర్లను సంప్రదించండి.

Next Story