భాగ్యనగరంలో ఫార్ములా-ఈ రేస్‌ని 2024లో చూడలేమా?

కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన ఫార్ములా E రేసింగ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Dec 2023 7:34 AM GMT
Formula E race, Hyderabad, Telangana Govt

భాగ్యనగరంలో ఫార్ములా-ఈ ని 2024లో చూడలేమా?  

ఫార్ములా E రేసు హైదరాబాద్‌లో ఈ ఏడాది చూడలేము. కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన రేసింగ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది. గత సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఫార్ములా-ఈ స్ట్రీట్ రేస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగవలసిన రేస్ దాదాపుగా రద్దయినట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ రావడంతో రేస్ నిర్వహించడం కష్టం అని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఫార్ములా E సంస్థ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ తో కలిసి 30 అక్టోబర్ 2023న రేసింగ్ కు సంబంధించి సంతకం చేసిన సంగతి తెలిసిందే. భారీ రేసింగ్ కు హైదరాబాద్ నగరం కూడా ఒక హోస్ట్ సిటీగా ఉంది. అయితే 2024 ఫిబ్రవరి 10 శనివారం షెడ్యూల్ చేసిన హైదరాబాద్ ఇ-ప్రిక్స్ స్టేజింగ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది. తెలంగాణ కొత్త ప్రభుత్వం నుండి ఇటీవల అధికారిక సమాచారం అందిన తరువాత, ఫార్ములా E చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫార్ములా E రేసు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం సాధ్యం కాదని తెలుస్తోంది.

ఫార్ములా ఇ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం ఈ నెల ప్రారంభంలో ఎన్నికలు జరిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వ కొత్త నాయకత్వంతో సమావేశమైంది. అప్పటి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి.

ఈవెంట్‌కు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి గుడ్ న్యూస్ వినిపించలేదు. ఫార్ములా E, భాగస్వాములు, సరఫరాదారులు ఈవెంట్‌లో ఇప్పటికే గణనీయమైన పెట్టుబడులు పెట్టారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమైన హైదరాబాద్ ఇ-ప్రిక్స్ ఫార్ములా ఇ, తెలంగాణ ప్రభుత్వం ద్వారా పెట్టుబడి పెట్టిన ఓవర్‌హెడ్ ఖర్చుల కంటే చాలా రెట్లు ఎక్కువ. రేసు నిర్వహించడం ద్వారా దాదాపు 84 మిలియన్ USDల ఆదాయం లభించింది. అయితే 2024లో మాత్రం ఈ రేసు నిర్వహించడం కష్టమేనని అంటున్నారు. ఫార్ములా E, తెలంగాణ ప్రభుత్వం మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఏడాది హైదరాబాద్ లో రేసు నిర్వహించడం కష్టమేనని తెలుస్తోంది. టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్‌లతో సహా ఇతర ప్రముఖ ప్రపంచ నగరాలలో వచ్చే ఏడాది రేసును నిర్వహించబోతున్నారు.

Next Story