యువతి డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీసిన ఇద్దరు యువకులు.. హైదరాబాద్‌లో ఘటన
Two youngsters arrest in video in trial room case in Hyderabad. హైదరాబాద్ నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయి. పోకిరీల చేష్టలతో యువతులు,
By అంజి Published on
5 Nov 2021 9:31 AM GMT

హైదరాబాద్ నగరంలో పోకిరీల ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయి. పోకిరీల చేష్టలతో యువతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని హెచ్ అండ్ ఎం షాపింగ్ మాల్‌లో దుస్తులు తీసుకుందామని ఓ యువతి వచ్చింది. దుస్తులు నచ్చడంతో వాటిని ట్రయల్ రూంకి తీసుకెళ్లింది. ట్రయల్ రూమ్‌లో యువతి డ్రెస్ మార్చుకుంటుండగా.. ఇద్దరు యువకులు వీడియో తీశారు. ఇది గమనించిన యువతి వెంటనే కేకలు వేసింది.
అక్కడున్న వారు వెంటనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వెంటనే షాపింగ్ మాల్‌కి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి డ్రెస్ మార్చుకుంటుండగా తీసిన వీడియోను డిలీట్ చేయించి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీడియో తీసిన ఇద్దరు యువకులతో పాటు స్టోర్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story