హకీంపేట్ లో ఊహించని విషాదం

జూన్ 28న హకీంపేటలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో నీటితో నిండిన గోతిలో పడి రెండేళ్ల బాలిక చనిపోయింది.

By Medi Samrat
Published on : 28 Jun 2024 4:00 PM

హకీంపేట్ లో ఊహించని విషాదం

జూన్ 28న హకీంపేటలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో నీటితో నిండిన గోతిలో పడి రెండేళ్ల బాలిక చనిపోయింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల నర్సరీ పిల్లోళ్లను చూసుకుంటూ ఉండేవారు. నివేదికల ప్రకారం, చిన్నారి ఆడుకోవడానికి బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు వర్షపు నీరు నిండిన గుంతలో పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. అనంతరం బాలిక మృతదేహం నీరు నిండిన గోతిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story