హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి, నలుగురి పరిస్థితి విషమం

Two school students died in a serious road accident in Charlapalli, Hyderabad. హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది.

By అంజి  Published on  8 Sept 2022 7:04 PM IST
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి, నలుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందరు. మరో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మల్కాజ్‌గిరి చర్లపల్లి జైలు వద్ద గురువారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఆటోడ్రైవర్ వినోద్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 10 మంది విద్యార్థులు ఉన్నారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

పాఠశాల విద్యార్థినులు ఈసీఐఎల్‌ నుంచి చర్లపల్లి వైపు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story