తుకారాం గేట్ రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్‌

Tukaram Gate RuB opened by K T Rama Rao. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద రూ.6 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయని

By Medi Samrat  Published on  4 March 2022 11:10 AM GMT
తుకారాం గేట్ రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్‌

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద రూ.6 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయని, మరిన్ని ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. తుకారాం గేట్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జిను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. నగరంలోని సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో కొత్త రైల్వే అండర్‌ బ్రిడ్జిలు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిల (ఆర్‌వోబీలు) అభివృద్ధి, నిర్మాణానికి ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైల్వే అండర్‌ బ్రిడ్జిలు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించేందుకు సిద్ధంగా ఉందని.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో దశాబ్దాలుగా విస్మరిస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. తుకారాం గేట్‌ అండర్‌ బ్రిడ్జి (రూబీ) నిర్మాణంతో దశాబ్దాలుగా పరిష్కారం కాని ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. లాలాగూడ హాల్ట్ స్టేషన్‌లో రైల్వే క్రాసింగ్‌ను తరచుగా మూసివేస్తుండ‌టంతో.. తుకారాం గేట్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభమ‌వ‌డం గొప్ప ఉపశమనం అని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. దీనికి తోడు మల్కాజిగిరి, మారేడ్‌పల్లి, తార్నాక, మెట్టుగూడ, లాలాపేట్-సికింద్రాబాద్ రహదారిపై ట్రాఫిక్ రద్దీని ఈ రైల్వే అండర్‌ బ్రిడ్జి తగ్గిస్తుంది.


Next Story
Share it