హైదరాబాద్ లో డ్రోన్స్ రోడ్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions tomorrow for police drone show. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ లోని దుర్గం చెరువు వంతెన వద్ద డ్రోన్ షో నిర్వహిస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 3 Jun 2023 2:00 PM GMTతెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ లోని దుర్గం చెరువు వంతెన వద్ద డ్రోన్ షో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూన్ 4న నగరంలో ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. జూన్ 4 సాయంత్రం 4 గంటల నుంచి జూన్ 5 ఉదయం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించబడుతుంది.
AIG హాస్పిటల్ నుంచి కేబుల్ వంతెన మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ - ఎడమ మలుపు - సైబర్ టవర్స్ - కుడి మలుపు - COD జంక్షన్ - నీరు జంక్షన్ - జూబ్లీహిల్స్ వద్ద మళ్లించనున్నారు. బయో డైవర్సిటీ, టీ-హబ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ IKEA రోటరీ - సైబర్ టవర్స్ - రైట్ టర్న్ - COD జంక్షన్ - నీరూస్ జంక్షన్ - జూబ్లీ హిల్స్ వద్ద మళ్లించనున్నారు. రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను రోడ్ నెం.లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద మళ్లిస్తారు. IKEA ఫ్లై ఓవర్ మూసివేస్తారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కార్/బ్లూ కోల్ట్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహాం వద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఉమెన్ సేఫ్టి కార్నివాల్, చార్మినార్ వరకు పుట్ మార్చ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పరిస్థితులను బట్టి ఆయా రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేయనున్నారు.
ట్యాంక్‌బండ్‌పై ఇరువైపులా, పీవీఎన్‌ఆర్ మార్గ్, బుద్దభవన్, నల్లగుట్ట, ఇందిరాగాంధీ రోటరీ రూట్లలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టీఎస్ ఉమెన్ పోలీస్ సేఫ్టి వింగ్ కార్నివాల్ ఉంటుంది. ఈ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ అనుమతి ఉండదు. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు పుట్‌మార్చ్ ఉంటుంది. ఈ సందర్భంగా ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. అంబేద్కర్ విగ్రహాం వద్ద ట్రాఫిక్ సేఫ్టి, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ తదితర అంశాలపై ప్రదర్శనలుంటాయి.