డిసెంబర్ 15 ఆదివారం హైదరాబాద్‌లో హెచ్‌సిఎల్ సైక్లోథాన్ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సైక్లోథాన్ ఉదయం 5 నుంచి 10 గంటలకు వన్ గోల్ఫ్ నుండి టి-గ్రిల్, కోకాపేట్ ఒఆర్ఆర్ సర్వీస్ రోడ్, కొల్లూరు జంక్షన్ యు-టర్న్, వన్ గోల్ఫ్ వద్ద ముగుస్తుంది. దీనికి సంబంధించి ఓఆర్‌ఆర్ (కొల్లూరు జంక్షన్ నుంచి కోకాపేట్ జంక్షన్ వైపు) ఎడమవైపున ఉన్న ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డును ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు తాత్కాలికంగా మూసివేస్తారు.
విప్రో జంక్షన్ నుండి కోకాపేట్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ టి-గ్రిల్ వద్ద - మైస్కేప్ రోడ్డు వైపు - వేద ఐఐటి - నార్సింగి నానక్రామ్‌గూడ సర్వీస్ రోడ్డు వైపు - మై హోమ్ అవతార్ ఎడమ మలుపు - కోకాపేట్ గ్రామం వైపు మళ్లించబడుతుంది. కొల్లూరు నుండి కోకాపేట్, మై హోమ్ అవతార్ వైపు వచ్చే ప్రయాణికులను కొల్లూరు జంక్షన్ వద్ద ORR సర్వీస్ రోడ్డుకు కుడి వైపున మళ్లిస్తారు. నార్సింగి నుండి విప్రో సర్కిల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు నానక్‌రామ్‌గూడ - ఖాజాగూడ సర్కిల్ - నానక్‌రామ్‌గూడ రోడ్డు - విప్రో సర్కిల్‌గా మళ్లిస్తారు.