ఆదివారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions in Hyderabad city on Sunday. ఈ నెల 28వ తేదీన(ఆదివారం) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
By Medi Samrat Published on 26 Aug 2022 8:30 PM ISTఈ నెల 28వ తేదీన(ఆదివారం) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఆదివారం ప్రారంభమై గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ముగియనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్‌కు ముందు నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సూచనలు జారీ చేశారు. అవసరమైన చోట ఉదయం 4:30 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పేర్కొన్నారు.
మారథాన్ రన్ రూట్ :
పీపుల్స్ ప్లాజా (నెక్లెస్ రోడ్) - ట్యాంక్ బండ్ - పీపుల్స్ ప్లాజా - ఖైరతాబాద్ - సోమాజిగూడ - పంజాగుట్ట ఫ్లైఓవర్ - MJ కళాశాల - SNT జంక్షన్ - సాగర్ సొసైటీ - KBR పార్క్ - జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ - రోడ్ నెం.45 - కేబుల్ వంతెన.
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, షాదాన్ కాలేజీ నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వెళ్లే వాహనదారులు తాజ్ కృష్ణ, రోడ్ నంబర్ 10, 12, క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. పంజాగుట్ట, రాజ్‌భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనదారులు ఖైరతాబాద్ జంక్షన్, షాదాన్ కాలేజీ, నిరంకారి భవన్ నుంచి రవీంద్ర భారతి మీదుగా వెళ్లాలి. ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. లిబర్టీ జంక్షన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు. ఇక్బాల్ మీనార్ యూ టర్న్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్ మీదుగా వాహనాలను అనుమతిస్తారు. బేగంపేట నుంచి రాజ్‌భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు వెళ్లే వాహనాలను గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్ నుంచి డీకే రోడ్ మీదుగా వాహనాలకు అనుమతిస్తారు. నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ఉదయం 9 గంటల వరకు వాహనాలను నిలిపివేస్తారు. కవాడిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి సెయిలింగ్ క్లబ్ వైపునకు వాహనాలను అనుమతించరు. మినిస్టర్ రోడ్డు నుంచి రాణిగంజ్ మధ్య కూడా వాహనాలను అనుమతించరు. నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద మళ్లిస్తారు. మారథాన్ రన్ ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్నప్పుడు ఫిల్మ్ నగర్, బివిబి జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చే ట్రాఫిక్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రోడ్ నెం.70, హాట్ కప్ వైపు మాదాపూర్ వైపు మళ్లిస్తారు.
ఆదివారం తెల్లవారుజామున 4:30 నుండి ఉదయం 10 గంటల మధ్య మారథాన్ రన్ సమయంలో ఈ జంక్షన్లు, రూట్‌లను నివారించాలని.. ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని పోలీసులు పౌరులను అభ్యర్థించారు.