డిసెంబర్ 17, మంగళవారం నాడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కారణంగా హైదరాబాద్ నగరంలో సోమవారం నాడు సిటీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ORR ఎగ్జిట్ నంబర్ 7 నుండి BITS జంక్షన్, తూంకుంట గ్రామం, హకీంపేట మీదుగా హకీంపేట వైపు ట్రాఫిక్ సాయంత్రం 4:30 నుండి 6:00 గంటల మధ్య తాత్కాలిక రద్దీ ఉంటుందని ట్రాఫిక్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అభ్యర్థించారు.
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా తెలంగాణ సచివాలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో సైబరాబాద్ పోలీసులు డ్రోన్లు ఎగరేయడంపై ఆంక్షలను విధించారు. తెలంగాణ సచివాలయం చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. ఈ ఆర్డర్ డిసెంబర్ 17 - డిసెంబర్ 21 మధ్య అమలులో ఉంటుంది. ఎవరైనా ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాల ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు.