బుధవారం GHMC ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసన మండలికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతూ ఉండడం, గురువారం ఓట్ల లెక్కింపు ఉండడంతో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం ఏప్రిల్ 23న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు GHMC ‘T’ జంక్షన్ నుండి BRKR భవన్ జంక్షన్ వరకు ట్రాఫిక్ అనుమతించరు. GHMC ‘T’ జంక్షన్ వద్ద రహదారిని సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేస్తారు. లిబర్టీ మరియు బషీర్‌బాగ్ వైపు నుండి BRKR లేన్ ద్వారా తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను GHMC ‘T’ జంక్షన్ వద్ద డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహం వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు ట్రాఫిక్ మళ్లింపును గమనించి సహకరించాలని పోలీసులు కోరారు.
జీహెచ్ఎంసీ లో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనున్నది. ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యా లయంలోనే పోలింగ్, కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికకు సంబంధించి ఎక్స్ అఫిషియో సభ్యులు, కార్పొ రేటర్లకు రెండు వేరువేరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.