రియల్ హీరో అయిన పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్

Traffic cop rescues mother and daughter trapped in blaze in Hyderabad. పంజాగుట్టలోని ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రాణాలను

By Medi Samrat  Published on  12 Feb 2022 6:48 PM IST
రియల్ హీరో అయిన పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్

పంజాగుట్టలోని ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రాణాలను అరచేత పట్టుకుని తల్లి కూతుళ్లు ఓ రూమ్ లో చిక్కుకుపోయారు. అది కూడా నాలుగో అంతస్తులో వారు ఉన్నారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఆయన ఎలాగైనా ఆ తల్లీకూతుళ్లను కాపాడాలని అనుకున్నారు. ఏ మాత్రం ఆలోచించలేదు. తన ప్రాణాలు లెక్క చేయకుండా పై టెర్రాస్ నుంచి ఆ ఇంటిపైకి దూకాడు. తల్లి కూతురుని ప్రాణాలతో కిందకు తీసుకుని వచ్చారు. ఆ తల్లీ బిడ్డను కాపాడిన పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.


Next Story