ట్రాఫిక్ సమస్యలు : సైబరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు మారిన టైమింగ్స్
Traffic Congestion Logout timings for IT employees working in Cyberabad changed. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 July 2023 7:12 PM ISTభారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో, దశల వారీగా తమ ఉద్యోగులను లాగ్‌అవుట్ చేసుకునే షెడ్యూల్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సాఫ్ట్ వేర్ కంపెనీలకు సూచించారు.
హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) జూలై 25, 26 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళవారం, మాదాపూర్, సైబరాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సదరు సాఫ్ట్ వేర్ కంపెనీలకు లాగౌట్ కు సంబంధించి కీలక సూచనలు చేసారు. ఆయా కంపెనీల పేర్లను ప్రస్తావిస్తూ.. వాటికి దశల వారీగా లాగ్ అవుట్ సమయాలను జాబితా చేయాలని సర్క్యులర్ జారీ చేశారు.
హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు జనం. ఐకియా, స్కై వ్యూ బయోడైవర్సిటీ, రాయదుర్గం, హైటెక్ సిటీ సమీపంలోని రోడ్లపై వాహనాలు బారులు తీరిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ప్రాంతాల్లో 15-16 కి.మీ.లు వెళ్లేందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోయారు. న్యూస్‌మీటర్‌తో గోనె సందీప్ డీసీపీ మాదాపూర్ మాట్లాడుతూ, చాలా కంపెనీలు ఈ సర్క్యులర్‌కు అంగీకరించాయని, తదనుగుణంగా లాగ్‌అవుట్‌ను షెడ్యూల్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. “మేము IKEA, బయోడైవర్సిటీ, రాయదుర్గం చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము. కంపెనీ నిర్వాహకులు అంగీకరించారు’’ అని తెలిపారు.
వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశల వారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది.
ఫేజ్ - 1
ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. రహేజా మైండ్‌స్పేస్, టిసిఎస్, హెచ్‌ఎస్‌బిసి, డెల్‌లో ఉన్న అన్ని కంపెనీలు, ఫియోనిక్స్ (మాదాపూర్/కొండాపూర్ అవన్స్), డెల్, ఒరాకిల్, క్వాల్‌కామ్, టెక్ మహీంద్రాలో ఉన్న అన్ని కంపెనీలు, పూర్వా సమ్మిట్‌లో ఉన్న అన్ని కంపెనీలు, వాటర్‌మార్, ఇతర IT కంపెనీలు/IT పార్క్‌లలో కంపెనీలకు ఇది వర్తిస్తుంది.
ఫేజ్ - 2
ఐకియా నుండి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. నాలెడ్జ్ సిటీలో ఉన్న అన్ని కంపెనీలు, నాలెడ్జ్ పార్క్, T-హబ్‌లో ఉన్న అన్ని కంపెనీలు, Galaxy, LTI & Twitzaలో ఉన్న అన్ని కంపెనీలు, Commerzòmeలో ఉన్న అన్ని కంపెనీలు, RMZ నెక్సిటీలో ఉన్న అన్ని కంపెనీలు, స్కైవ్యూ 10 & 20లో ఉన్న అన్ని కంపెనీలు, దియశ్రీ ఓరియన్‌లో ఉన్న అన్ని కంపెనీలు, దియాశ్రీ ఓరియన్‌లో ఉన్న అన్ని కంపెనీలు, ఈ/ఐటీ పార్క్‌లో ఉన్న ఇతర కంపెనీలకు ఇది వర్తిస్తుంది.
ఫేజ్ - 3
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3-6 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. Microsoft, Infosys, Wipro, Centaurus, Broadway, Virtusa, BSR IT పార్క్‌లో ఉన్న అన్ని కంపెనీలు, ICICI, Waverock లో ఉన్న అన్ని కంపెనీలు, Amazon, Honeywell, Hitachi, Sattva Capital, Cap Gemini, GARలో ఉన్న అన్ని కంపెనీలు, Franklin Tempicton లో ఉన్న అన్ని కంపెనీలు, QL సిటీలో ఉన్న అన్ని కంపెనీలు, D/FIT ప్రాంతంలో ఉన్న కంపెనీలకు ఇది వర్తిస్తుంది.