శంషాబాద్‌లోని ముచ్చింతలలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమరోహా వేడుకలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సమతమూర్తి కేంద్రానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. ఆయన పర్యటన దృష్ట్యా ఆదివారం సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ముచ్చింతల్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి.. ఆ తర్వాత రామానుజచార్యులు బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఉత్సవంలో పాల్గొంటారు. హైదరాబాద్ సిటీ నుండి పాలమాకుల గ్రామం నుండి ఆశ్రమ రహదారిలోకి ప్రవేశించడానికి ప్రజలు తమ వాహనాలను స్వర్ణ భారత్ ట్రస్ట్ వెనుక పడమర వైపు పార్కింగ్ వద్ద పార్క్ చేసి యాగశాల వద్దకు వెళ్లాలి.
విజయవాడ, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 వద్ద దిగి సంగిగూడ గ్రామం వద్ద ఉన్న ఆశ్రమ రహదారిలోకి ప్రవేశించి గొల్లూరు గ్రామ సమీపంలోని తూర్పు పార్కింగ్ వద్ద వాహనాలను నిలిపి యాగశాల, విగ్రహం వద్దకు వెళ్లాలి. ఎన్‌హెచ్ 44, ఓఆర్‌ఆర్ మధ్య పీ1 రహదారి (ఆశ్రమ రహదారి) మీదుగా వెళ్లే అన్ని భారీ వాహనాలు శంషాబాద్ వైపు మళ్లించబడతాయి. భారత రాష్ట్రపతి సందర్శన సమయంలో భద్రత దృష్ట్యా విగ్రహ ప్రాంగణంలోకి సాధారణ ప్రజల ప్రవేశం సాయంత్రం వేళల్లో పరిమితం చేయబడుతుంది. భారత రాష్ట్రపతి కోవింద్ పర్యటన సందర్భంగా భద్రత దృష్ట్యా.. విగ్రహ ప్రాంగణంలోకి సాధారణ ప్రజల ప్రవేశం మధ్యాహ్నం 1 గంటల మధ్య పరిమితం చేయబడుతుంది.