హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెల్లార్ కోసం తవ్విన గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. మృతులను రమ్య (7), సోఫీయా(12), సంగీత(14)గా గుర్తించారు. బాలికల మృతితో వారి కుటుంబాల్లో తీవ్రవిషాదం నెలకొంది. బాలికల తల్లిదండ్రులు బాలికల మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముగ్గురు బాలికలు మృతిచెందడంతో గుంత తవ్విన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు, స్థానికులు. గుంతపై ఎలాంటి పైకప్పు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. గుంతను వెంటనే పూడ్చాలని కోరుతున్నారు.