నానక్‌రాంగూడలో విషాదం.. ఈత‌కు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

Three Boys Died at Golf Course. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  19 Nov 2022 12:28 PM GMT
నానక్‌రాంగూడలో విషాదం.. ఈత‌కు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోల్ఫ్ కోర్స్ దగ్గర నీటి సంపులో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్షణ గోడ లేకపోవడంతో చిన్నారులు గోల్ఫ్ కోర్స్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు.

గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం నానక్‌రామ్‌ గూడలోని పటేల్‌ కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు కుంటలోపడి ప్రాణాలు విడిచారు. మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన చిన్నారులను షాబాజ్‌(15), దీపక్‌(12), పవన్‌(14)గా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు

Next Story