చెట్లను కూల్చేస్తారా.? : కేంద్ర మంత్రి హెచ్చరికలు

కంచ గచ్చిబౌలిలో చెట్లను కూల్చివేసిన వారికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు.

By Medi Samrat
Published on : 3 April 2025 5:45 PM IST

చెట్లను కూల్చేస్తారా.? : కేంద్ర మంత్రి హెచ్చరికలు

కంచ గచ్చిబౌలిలో చెట్లను కూల్చివేసిన వారికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో చెట్లను కూల్చివేసి పర్యావరణాన్ని నాశనం చేసినందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. "హైదరాబాద్‌లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. చెట్లతో ఈ శత్రుత్వం ఏమిటో? లైట్లు ఏర్పాటు చేసి రాత్రిపూట పెద్ద సంఖ్యలో బుల్డోజర్లతో లోపలికి వెళ్లి 400 చెట్లను కూల్చాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఈ ప్రాంతంలో నెమళ్ళు, జింకలు చిత్రాలు ఉన్నాయి. ఈ సమస్యకు సంబంధించి వాస్తవ నివేదిక కోసం తెలంగాణ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపుతాము. బాధ్యులపై చర్యలు తీసుకుంటాము." అని హెచ్చరించారు కేంద్ర మంత్రి.

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బిఆర్ఎస్ ఎంపి రవి చంద్ర అడిగిన అనుబంధ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. కంచ గచ్చిబౌలిలో వందలాది చెట్లు నరికివేస్తున్నారని, వన్యప్రాణులు చనిపోతున్నాయని, ఈ ప్రాంతంలోని చెట్లు, వన్యప్రాణులను కాపాడాలని తాను అభ్యర్థిస్తున్నానని రవి చంద్ర అన్నారు.

Next Story