ఓటీటీ కంటెంట్ దొంగ.. 'తోప్ టీవీ' నిర్వ‌హ‌కుడు అరెస్టు

Thop TV Owner Arrested. ఓటీటీ కంటెంట్ ను కాపీ కొట్టి.. ఏపీకే ద్వారా ఫ్రీగా విడుద‌ల చేస్తున్న వ్య‌క్తిని మహారాష్ట్ర పోలీసులు

By Medi Samrat  Published on  14 July 2021 8:33 PM IST
ఓటీటీ కంటెంట్ దొంగ.. తోప్ టీవీ నిర్వ‌హ‌కుడు అరెస్టు

ఓటీటీ కంటెంట్ ను కాపీ కొట్టి.. ఏపీకే ద్వారా ఫ్రీగా విడుద‌ల చేస్తున్న వ్య‌క్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వివ‌రాళ్లోకెళితే.. హైదరాబాద్ కు చెందిన ఐటీ ఇంజనీర్ సతీష్ వెంకటేశ్వర్లు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, తదితర ఓటీటీల కంటెంట్ లను నిందితుడు దొంగిలిస్తున్నాడు. అంతేకాదు 'తోప్ టీవీ' అనే ఏపీకే ద్వారా ఫ్రీగా విడుదల చేస్తున్నాడు. సతీష్.. రెండేళ్లుగా తోప్ టీవీని నడుపుతున్నాడు.

అయితే.. వాయ్ కామ్ 18 మీడియా సంస్థ సతీష్ పై ఫిర్యాదు చేసింది. దీంతో సతీష్ పై మహారాష్ట్రకు చెందిన సైబర్ సెల్ పోలీస్ టీమ్ కేసు నమోదు చేసింది. ఈ నేఫ‌థ్యంలోనే మహారాష్ట్ర నుండి ప్రత్యేక పోలీస్ బృందం హైద్రాబాద్ కు చేరుకొని గుర్రంగూడలో నివసిస్తున్న సతీష్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. అనంత‌రం ముంబై కోర్ట్ లో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.


Next Story